జగనన్న ప్రభుత్వంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
1 min read– మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్
– మున్సిపల్ వైస్ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ రాయచోటి: ఫయాజూర్ రహ్మాన్, కౌన్సిలర్లు అన్నా సలీం,షబ్బీర్ అహ్మద్,ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరుడు రమాకాంత్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో అన్నమయ్య జిల్లా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ల ఆదేశాలు మేరకు రాయచోటి పట్టణంలో గురువారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఫాయజుర్ రహ్మాన్,కౌన్సిలర్ లు అన్నా సలీం,షబ్బీర్ అహ్మద్ అధ్వర్యంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరుడు రమా కాంత్ తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు.పట్టణంలోని ఇంటింటికీ వెళ్లి ఎన్నికల నమూనా పత్రాన్ని అందజేసి ఈ నెల 13 వ తేదీన జరిగే పోలింగ్ కేంద్రంలో వెన్నపూస రవీంద్ర రెడ్డి ఫొటో ప్రక్క 1 అని రాసి మి విలువైన ఓటును వారికి వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువతకు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యారన్నారు. జగనన్న ప్రభుత్వం లో సుమారు లక్షకు పైగా సచివాలయ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు గ్రామ వార్డు వాళ్ళింటలుగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. నిజంగా జగనన్న మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మంచి విద్యావేత్తతో పాటు న్యాయమూర్తి పై కూడా మంచి అనుభవం వున్నటు వంటి వ్యక్తి అని అన్నారు.ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గెలిపించి కున్నట్లయితే నిరుద్యోగ యువతకు మరెన్నో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారి వంతు కృషి చేస్తారని ఈ సందర్బంగా వారు వివరించారు.ఈ ప్రచారంలో కొత్తపల్లి ఇంతియాజ్,సలీమ్, షబ్బీర్, బసిరెడ్డి, వసీమ్, సోషల్ మీడియా కన్వినర్ ఉబైదూర్ రెహమాన్, సల్మా, ఇంతియాజ్,సల్మాన్, బాబా ఫాకరుద్దీన్, బాలాజీ,పట్టణ మహిళా అధ్యక్షురాలు నాజనీన్ ,సయ్యద్, ముజీబ్,రజాక్, ఇర్శాద్,కటిక హజార్ తదితరులు పాల్గొన్నారు.