PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాషన్ డిజైన్ తో మహిళలకు ఉపాధి అవకాశాలు

1 min read

త్వరలో మంత్రాలయంలో ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు

నిర్వాహకురాలు శ్రీ మతి సాధన

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  ఫ్యాషన్ డిజైన్ తో మహిళలకు, యువతులకు, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని  సుమేధ ఫ్యాషన్ ఇన్సిస్ట్యూట్ నిర్వాహకురాలు సాధన జి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామచంద్ర నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీనివాస సేవా ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థుల ఆశిస్సులతో ఢిల్లీ లోని డాక్టర్ ఎపీజె అబ్దుల్ కలాం టెక్నికల్ ఎజుకేషన్ కౌన్సిల్ తో భాగస్వామ్యం తో నూతనంగా జనవరి 5 వ తేదీన స్థానిక రామచంద్ర నగర్ కాలనీలో సుమేధ ఫ్యాషన్ ఇన్సిస్ట్యూట్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  2015 సంవత్సరంలో మొదట ఉడుపి జిల్లాలోని కార్కకళలో ప్రారంభించి బెంగళూరు, మైసూరు, శివమొగ్గ సికారిపుర, చెన్నై లో బ్రాంచీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనుభవం కలిగిన ఎంఎస్సీసి, బి ఎస్సి సి అర్హత కలిగిన మహిళల ద్వారా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా రంగాలను అనుసరించి రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుందని, దాని ద్వారా బ్యాంకు రుణాలు పొంది వ్యాపారాలు చేస్తూ తమ కాళ్ల పై ఇతరుల మీద ఆధార పడకుండా సొంతంగా ఉపాధి పొందవచ్చునని తెలిపారు. దీని ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా బలం చేకూరుతుందని చెప్పారు. వాటర్ ప్రూఫ్, హెచ్ డి మేకప్, 3డి మేకప్, బ్రిడాల్ మేకప్, పార్టీ మేకప్, శారీ డ్రాపింగ్, హైర్ స్టైల్ లాంటి వాటిలో శిక్షణ ఇవ్వడం జరిగుతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శిక్షణ పొంది నైపుణ్యం కలిగిన చందన పాల్గొన్నారు.

About Author