NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టి.జి భరత్ గెలిస్తే ఉపాధి అవకాశాలు..

1 min read

– టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్లో టి.జి భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని టిడిపి నగర అద్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. నగరంలోని 45 వ వార్డు లేబర్ కాలనీ, కప్పల్ నగర్లో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం నాగరాజు యాదవ్, టిడిపి నేతలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దినసరి కూలీలు, గౌండాలకు మంచి ఉపాధి ఉంటుందన్నారు. కర్నూలుకు టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే స్థానికంగా పరిశ్రమలు తీసుకువస్తారన్నారు. అప్పుడు ప్రజల ఉపాధికి ఇబ్బంది ఉండదన్నారు. ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పెరిగిపోయిన నిత్యవసర ధరలు, కరెంటు బిల్లులు, పన్నులతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు సుంకన్న, రమణ, ప్రభాకర్, సుందర రాజు, లక్ష్మన్న, రాముడు, నాగరాజు, వెంకటేష్, సుధాకర్, రవి, అశోక్, ఆంజనేయులు, రాం ప్రసాద్, నరేష్, జవరాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author