స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా యువతులకు ఉపాధి అవకాశం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/2-11.jpg?fit=550%2C330&ssl=1)
పాటుగా మానసికోల్లాసాన్ని కూడా పొందవచ్చు డాక్టర్:సిస్టర్ మెర్సి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో హోమ్ సైన్స్ విభాగం మరియు సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ వారు నిర్వహించిన రెండు రోజుల స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ షాప్ లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సి పాల్గొని ప్రసంగించారు. మానసిక అశాంతి ఆందోళనలతో కూడిన నేటి ఆధునిక జీవితంలో కళలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, కళల ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చని అన్నారు. తమ కళాశాలలో విద్యార్థినులకు ఇలాంటి వర్క్ షాపుల ద్వారా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేశారు. కళాశాల విద్యార్థులు మరియు గృహిణులు పెద్ద సంఖ్యలో వర్క్ షాప్ లో పాల్గొన్నారు. శ్రీ గురు స్క్రీన్ ప్రింటింగ్, రాజమహేంద్రవరం నుంచి విచ్చేసిన బి జ్యోతి మరియు వై మాధవిలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.హోమ్ సైన్స్ విభాగాధిపతి ఎమ్ పద్మజా మాట్లాడుతూ స్క్రీన్ ప్రింటింగ్ అంటే స్టెన్సిల్ మిషన్స్ స్క్రీన్ ద్వారా సిరాను నొక్కడం ద్వారా ప్రింటెడ్ డిజైన్ సృష్టించే ప్రక్రియ. స్క్రీన్ ప్రింటింగ్ అనేది గోల్డ్ కాన్వాసులు పోస్టర్లు మరియు కళాకృతులను సృష్టించడానికి ఒక ప్రభావంతమైన టెక్నిక్ కానీ ఈ పద్ధతిని బట్టలు మరియు వస్త్రాలను ముద్రించడానికి కూడా ఉపయోగించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమాన్ని అధ్యాపకులు టి ఝాన్సీ, సిహెచ్ సుష్మ ,ఎం ప్రియాంక మరియు ఎన్ శిరీషలు నిర్వహించారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/21-2.jpg?resize=550%2C733&ssl=1)