ఉపాధి కూలీ రోజుకు 274 రూ.లు : సురేంద్ర
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఉపాధి హామీ పథకం పనికి తగ్గట్లుగానే కూలీ వస్తుందని అంబుడ్స్ మెన్ పర్సన్ సురేంద్ర ఉపాధి కూలీలతో అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని శుక్రవారం ఉదయం తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన ఉపాధి పనికి ఉదయాన్నే వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పిన విధంగా పనులు చేసుకుంటే రోజుకు 274 రూపాయలు కూలీ వస్తుందని అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 150 రోజులు పని దినాలు ఉన్నాయని అన్నారు.వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పనికి చాలా తక్కువగా కూలీలు వస్తున్నారని కూలీలను తప్పని సరిగా పెంచాలని ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ ను హెచ్చరించారు.తర్వాత మధ్యాహ్నం మిడుతూరు ఉపాధి హామీ పథకం కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై కూలీల హాజరు చాలా తక్కువగా ఉందని దీని పట్ల జిల్లా కలెక్టర్ మరియు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ చాలా సీరియస్ గా ఉన్నారని మండలంలోని ప్రతి గ్రామంలో కూలీలను తప్పనిసరిగా పెంచాల్సిందేనని ఆయన టెక్నికల్ అసిస్టెంట్ లను మరియు సిబ్బందిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ బి.జయంతి,టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.