ఉపాధి పనుల్లో వేగం పెంచాలి: ఏపీఓ
1 min read
మిడుతూరులో ఉపాధి మేట్లకు శిక్షణ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మహిళా మండలి పొదుపు సమాఖ్య భవనంలో ఉపాధి హామీ పథకం మేట్లకు ఏపీవఓ భూపన జయంతి ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి పనుల గురించి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఉపాధి హామీ కోర్సు డైరెక్టర్ ఇస్మాయిల్ మేట్లకు శిక్షణ ఇచ్చారు.గ్రామాల్లో కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేసుకుని కొలతల వారీగా పనులు చేయించే బాధ్యత మెట్లదేనని అన్నారు.రోజూ బాగా పనిచేసినట్లయితే 300 రూ.లు ఉపాధి కూలీ వస్తుందన్నారు. ఈనెల చివరి లోపు వంద రోజులు తక్కువగా ఉన్నవారు పూర్తి చేసుకునే విధంగా వారికి చెప్పాలని కోర్సు డైరెక్టర్ అన్నారు.గ్రామాల్లో ఉపాధి పనుల్లో వేగం పెంచాలని కూలీలకు పనుల పట్ల అవగాహన కల్పించి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రద్ధ కనబరచాలని వలసలు లేకుండా ప్రతి ఒక్కరికీ పనులు కల్పించే విధంగా చూడాలని ఎండాకాలం కాబట్టి ఉదయాన్నే వెళ్లి కొలతల ప్రకారం పనులు చేయించాలని ఏపీవో జయంతి అన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు పాల్గొన్నారు.