ఉపాధి కూలీలు వలసలు వద్దు : డ్వామా పీడీ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గ్రామాల్లో ఉన్న ఉపాధి కూలీలు వలసలు వెళ్లకుండా మీ గ్రామాల్లోనే జరుగుతున్నటువంటి ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు.మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో జరుగుతున్న ఆజాదీకా అమృత్ సరోవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడారు. అన్ని పంచాయతీలలో ఉపాధి కూలీలను పెంచాలని కూలీలకు రోజుకు 257 రూపాయలు వేతనం పడేలా పనులు చేయించాలని అన్నారు.చిన్న సన్న కారు రైతులకు వారి పొలాలకు సొంత ఖర్చులతో మట్టిని తోలుకోవచ్చని అన్నారు.అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఉపాధి కూలీలను తరలించాలని పనుల పట్ల ఉపాధి కూలీలతో సిబ్బంది మాట్లాడి పనులకు వెళ్లే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు.అంతేకాకుండా ప్రతి టెక్నికల్ అసిస్టెంట్ కు 500 మంది కూలీలు తగ్గకుండా పనులు చేయించాలన్నారు.గ్రామాల్లో ఎవరైనా వలసలు వెళ్తుంటే వెళ్లకుండా ఇక్కడే వారికి పనులు కల్పించే విధంగా చూడాలని డ్వామా పీడీ రామచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు.ఈకార్యక్రమంలో ఏపీఓ జయంతి,ఈసీ నరేష్,టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.