PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నతి మహిళా శక్తితో సాధికారిత..

1 min read

ఎస్సీ, ఎస్టీ మహిళల జీవనోపాధికి ఊతం..సున్నా వడ్డీకే రుణాలు,

ఆటో రిక్షాల కొనుగోలుకు ప్రోత్సాహం..

11 మంది స్వయం సహాయక మహిళలకు ఆటోలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

 పల్లెవెలుగు వెబ్​ ఏలూరు :  ఎస్సీ, ఎస్టీ మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి-మహిళాశక్తి అనే ప్రత్యేక పధకం ద్వారా వారి జీవనోపాధికి సున్నా వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ లో గురువారం ఉన్నతి-మహిళాశక్తి పధకాన్ని ప్రారంభించి 11 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. అనంతరం సంబంధిత ఆటో లో కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ , జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి ప్రయాణించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల మహిళల జీవనోపాధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతి మహిళాశక్తి పధకాన్ని  ప్రవేశపెట్టారన్నారు.  మహిళల జీవనోపాధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు.  ఆటో నడుపుకోవడం ద్వారా రోజూ ఆదాయం పొందివారు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు వీలుంటుందన్నారు.  లబ్దిదారులపై ఎటువంటి భారం లేకుండా సులభవాయిదాల్లో రుణాలు చెల్లించుకుంటు కుటుంబాలను పోషించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ఆటో కొనుగోలు సమయంలో లబ్దిదారులు 10 శాతం వాటా ధనాన్ని ఎస్ హెచ్ జి బ్యాంకు ఖాతాలోజమచేస్తే మిగిలిన 90 శాతం వడ్డీలేని రుణంగా అందించడం జరుగుతుందన్నారు.  ఏలూరు జిల్లాలో 12 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 37.97 లక్షల విలువైన ఉన్నతి – మహిళాశక్తి పధకం ఆటోలను  మంజూరు చేయగా వాటిలో గురువారం 11 మంది మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. ఇందుకోసం రూ. 36 లక్షలు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.  మహిళల జీవనోపాధికి చేపట్టిన ఈ కార్యక్రమం మిగిలిన మహిళలలో కూడా అత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు.  మహిళలు నిర్వహించే ఆటోల్లో మహిళలు , పిల్లలు, ధైర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు.  ఆటోలు తీసుకొనే మహిళలలకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించడం జరుగుతుందని వీరికి డీఅర్ డి ఏ,రవాణాశాఖ అధికారులు ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామన్నారు.  కేవలం ఈ 11 మంది మహిళలతోనే ఈ పధకం ఆగకుండా మరింతమంది ఎస్ .హెచ్ .జి మహిళలు ముందుకు రావాలన్నారు.  కాలుష్య నియంత్రణను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్,డీజిల్ తో నడిచే ఆటోలు కాకుండా సిఎన్ జి ఆటోలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ సెర్ఫ్ ఉన్నతి విభాగం ద్వారా మహిళల జీవనోపాధి కల్పించేందుకు మహిళా శక్తి ఆటో పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.  ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రస్తుతం 12 ఆటోరిక్షాల పంపిణీకి సిద్దం చేశామన్నారు.  ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలు స్వయం సహాయ సంఘాల సభ్యులై ఉండి , వయస్సు 20 ఏళ్ల నుంచి 45 ఏళ్లు లోపు ఉండాలన్నారు.  తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగియుండాలన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో నివశించే మహిళలు ఈ పధకానికి అర్హులన్నారు. లబ్దిదారులేతమకు కావాల్సిన ఆటోరిక్షాలను ఎంపిక చేసుకోవలసియుంటుందన్నారు.  10 శాతం లబ్దిదారుల వాటాగా, మిగిలిన 90 శాతం వడ్డీలేని రుణం కల్పించడం జరుగుతుందన్నారు.    జీవనోపాధికి ఊతం.దెందులూరు మండలం కొవ్వలి గ్రామ సంఘానికి చెందిన మాత్రపు నిర్మల కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నతి-మహిళాశక్తి పధకంలో కొత్త ఆటోరిక్షా వడ్డీలేని వాహనం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ప్రభుత్వం అందించిన సహకారంతో రూ. 3,32,718 లతో సిఎన్ జి ఆటో కొనుగోలు చేయగా 3 లక్షల రూపాయలు మహిళా ఉన్నతి కింద వడ్డీలేని రుణం మంజూరు చేశారని మిగిలిన 33 వేల 278 రూపాయలు లబ్దిదారుల వాటాకు చెల్లించామని చెప్పారు.  మా కుటుంబం ఆర్దికంగా ఎదగడానికి ఈ పధకం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, ఐసిడిఎస్ పిడి కె.పద్మావతి, ఆర్టిఓ శ్రీహరి, బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, ఎస్సీ కార్పోరేషన్ ఇడి కుమిదినీ సింగ్, మహిళా శక్తి సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author