ఎన్ కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం !
1 min read
పల్లెవెలుగు వెబ్: జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పూంచ్ _రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాద కార్యకలాపాలు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్న పాక్ ఉగ్రవాది అబు జరారను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నిఘా వర్గాల సమాచరంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ లో అతడు హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, ఒక గ్రనేడ్ , కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.