గృహ లబ్ధిదారులను ప్రోత్సహించండి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పీరు సాహె బ్ పేట గ్రామంలో జగనన్న కాలనీని ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసీల్దారు సిరాజుద్దీన్, హౌసింగ్ ఇన్చార్జి రమేష్ పరిశీలించారు. గ్రామంలో మొత్తం 28 ఇళ్లకు గానూ 6 పూర్తి, 2 స్లాబ్, 2 గోడలు,18 బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. ఉగాది లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యంగా బేస్మెంట్ స్థాయిలో ఉన్న లబ్దిదారులకు నోటీసులు ఇచ్చి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకొనేలా ప్రోత్సహించాలని పిఎస్,వీఆర్వో,ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకి సూచించారు. ప్రజలను ప్రోత్సహించడంలో సహకరించాలని వారు అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా అలాగే ప్లాట్ నెం.78 లబ్దిదారులు ప్రభుత్వ స్థలాన్ని అక్రమించడం వలన వారికి కేటాయించిన ఇంటి స్థలం పరిధి వరకే ఇంటి నిర్మాణం చేసుకోవాలని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు.