టైక్వాండో క్రీడాకారులను ప్రోత్సహిస్తా..
1 min readడాక్టర్ .సి.వాసురెడ్డి
టైక్వాండో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని విఆర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. వాసిరెడ్డి వ్యాఖ్యానించారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన క్రీడాకారుల కు బ్లాక్ బెల్ట్ ల ప్రధానం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు మాట్లాడుతూ టైక్వాండో వ్యక్తిగత క్రీడాంశమని ,ఇది ఒలంపిక్స్ లో ఉందన్నారు. అకాడమీలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని క్రీడాకారులు సాధన చేసి రాణించాలన్నారు. అనంతరం బ్లాక్ బెల్ట్ గ్రహీతలకు బెల్టులు ప్రధానం చేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు సీనియర్ తైక్వాండో కోచ్ బ్లాక్ బెల్ట్ లు సాధించిన విద్యార్థులు గువ్వల సూర్య భార్గవ్. గువ్వల శ్రీ లలిత సాయి హాస్టల్ టైక్వాండో శిక్షణ పొందినటైక్వాండో కోచ్ K. రోహిత్ మల్లేష నందిని అశ్విని విశ్వాస రావుA.రోహితు ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.