సామూహిక మరుగుదొడ్డి స్థలం ఆక్రమణ
1 min read– ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ తాసిల్దార్ కు వినతిపత్రం
పల్లెవెలుగు , వెబ్ గడివేముల: ఆక్రమణకు ఏది అనర్హం కాదంటూ ఏకంగా గతంలో గ్రామస్తులు ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని దాతలు ప్రభుత్వానికి ఇచ్చిన బహిరంగ మరుగుదొడ్డి స్థలాన్ని ఆక్రమించుకొని భవన నిర్మాణానికి పునాదులు తీస్తున్న సంఘటన గని గ్రామంలో చోటుచేసుకుంది మండలంలోని గని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బీసీ కాలనీలో వాల్మీకి పేటలో ఉన్న మహిళల సామూహిక మరుగుదొడ్డి స్థలాన్ని జెసిబి తో చదును చేసి వైసిపి నాయకులకుచెందిన సొంత వ్యక్తులకు ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని గృహ నిర్మాణాన్ని వినియోగించుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల హర్షవర్ధన్ గడివేము తహసిల్దార్ శ్రీనివాసులకు మంగళవారం నాడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల హర్షవర్ధన్ మాట్లాడుతూ తమ పూర్వికులు కీర్తిశేషులు. వెంకటయ్య గని గ్రామంలో సర్పంచ్ గా ఉన్న సమయంలో బీసీ కాలనీ వాల్మీకి పేట చెందిన మహిళలు ఆరు బయట బహిర్ భూమికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతుంటే అప్పటి సర్పంచ్ వై వెంకటయ్య తన సొంత స్థలములో సొంత నిధులతో మరుగుదొడ్డిని ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని ఉన్నత అధికారులు స్థలాన్నిపరిశీలించి గ్రామానికి ఉపయోగపడే పనులకు వాడుకోవాలని ఈ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.