ఆందోళనకు ముగింపు.. ఏడాది తర్వాత ఇంటికి రైతన్నలు !
1 min readపల్లెవెలుగు వెబ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల పోరుబాట ఏడాది పాటు నిరాటంకంగా కొనసాగింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులు బేషరతుగా ఎత్తివేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతన్నలు ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ఇంటి బాటపట్టారు. ఏడాదిగా కొనసాగిన నిరసనలకు ముగింపు పలికారు. ఢిల్లీ సరిహద్దుల్లోని టెంట్లను పీకేస్తున్నారు. ఈనెల 11న నిరసనలు ముగించి ఇంటికి వెళ్తున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరోసారి ఆందోళనకు సిద్ధమవుతామని రైతన్నలు హెచ్చరించారు.