PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..

1 min read

విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి తాసిల్దార్ శ్రీనివాసులు.

పల్లెవెలుగు వెబ్ గడివేముల : 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమమును గడివేములలో గ్రంథాలయాధికారి వి. వెంకటేశ్వర రెడ్డి  పర్యవేక్షణలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తహసిల్దార్ టీ. శ్రీనివాసులు. చదువుల తల్లి సరస్వతి పటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రంథాలయాలలో నవలలు ,కరెంట్ అఫైర్స్, వార, మాస, దిన పత్రికలు అందుబాటులో ఉంటాయని వీటిని చదువుకోవడం వల్ల సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుందని అని అన్నారు. గ్రంథాలయ అధికారి వి. వెంకటేశ్వర రెడ్డి  మాట్లాడుతూ విద్య జీవితానికి దారి చూపుతుందని చదువు అనే సంపద మన వెంట ఉన్నప్పుడు ఎక్కడైనా ధైర్యంగా జీవిస్తూ సమస్యలను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ఈ వారోత్సవాలు సక్సెస్ కావడానికి సహకరించిన పత్రిక విలేకరులకు, అధికారులకు, నాయకులకు, గ్రామ ప్రజలకు గ్రంథాలయ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం అయినది. అనంతరం 1. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ 2. స్వాతంత్ర ఉద్యమంపై మరియు సమాజంపై గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ప్రథమ బహుమతిగా శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ విద్యార్థిని  బి. శ్రీ భారతి నైన్త్ క్లాస్, ద్వితీయ బహుమతిగా సెయింట్ పాల్ హై స్కూల్ విద్యార్థిని బి. మధు కీర్తన ఎయిత్ క్లాస్, తృతీయ బహుమతి గా  జడ్పీహెచ్ . స్కూల్ విద్యార్థిని ఉర్దూ మీడియం రుక్షాన నైన్త్ క్లాస్, అదేవిధంగా ఏపీ మోడల్ హై స్కూల్, కస్తూరిబా హై స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతిగా కస్తూరిబా హై స్కూల్ విద్యార్థిని లక్ష్మీ బాయ్, రెండో బహుమతిగా మోడల్ హై స్కూల్ విద్యార్థిని జ్యోతి, మూడో బహుమతిగా మోడల్ హై స్కూల్ విద్యార్థిని వైష్ణవి వీరికి ముఖ్య అతిథి ఎమ్మార్వో టీ. శ్రీనివాసులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో VN. ప్రసాద్ నాయుడు , సామన్న.మరియు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

About Author