NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుట్టిన రోజైనా మ‌ద్య నిషేధం అమ‌లు చేయండి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌ద్య నిషేధం హామీని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు టీడీపీ మ‌హిళా నేత వంగ‌ల‌పూడి అనిత‌. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో మ‌ద్యం దుకాణాన్ని తెలుగు మ‌హిళ‌ల ఆధ్వ‌ర్యంలో ముట్ట‌డించారు. పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధం హామీ ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు. మ‌ద్య‌నిషేధం అమ‌లు చేయ‌కుండా దానిని ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. అక్ర‌మ సంపాద‌న కోస‌మే మ‌ద్యం దుకాణాల వ‌ద్ద ఆన్ లైన్ పేటెంట్ సిస్ట‌మ్ పెట్ట‌లేద‌ని ఆరోపించారు. నాసిర‌కం బ్రాండ్ల‌న్నీ ఏపీలోనే దొరుకుతాయ‌ని అన్నారు.

                                               
      

About Author