‘అన్నమయ్య’ లో 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు
1 min read
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా అంతటా జూన్ నెల ఒకటో తేది నుండి నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.యస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలు లేదా ర్యాలీలు నిర్వహించే వారు వ్రాతపూర్వకంగా పోలీసు అధికారులకు తెలియజేస్తూ వారి నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు లేదా ర్యాలీలు నిర్వహిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ. వి. హర్షవర్షన్ రాజు ఐ.పి.యస్ గారు తెలిపారు.