PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌ణితంలో వెనుక‌బ‌డ్డ ఇంజినీరింగ్ విద్యార్థులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి పరఖ్‌ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్‌’ పేరిట ఈ స్టూడెంట్‌ లెర్నింగ్‌ అసెస్‌మెంట్‌ ను ఇటీవల నిర్వహించింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్‌ పేరిట ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్‌ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది.

                                       

About Author