NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. వ్యాఖ్యాత‌గా పాల‌మూరు బిడ్డ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇంగ్లండ్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో ఐదో టెస్ట్ మ్యాచ్ ల‌కు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాత‌గా పెబ్బేరు వాసి షోయబ్ కు అవ‌కాశం ద‌క్కింది. గ‌తంలో ప‌లు అంత‌ర్జాతీయ‌, జాతీయ మ్యాచ్ ల‌కు రేడియోలో షోయ‌బ్ వ్యాఖ్యాత‌గా వ్యవ‌హ‌రించారు. ఇంగ్లండ్, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య సెప్టంబ‌ర్ 2 నుంచి 4 వ‌ర‌కు నాలుగో టెస్ట్, 10 నుంచి 14 వ‌ర‌కు జ‌రిగే ఐదో టెస్ట్ మ్యాచ్ కు ముంబైలోని సోనీ నెట్ వ‌ర్క్ స్టూడియోలో తెలుగులో లైవ్ కామెంట‌రీ ఇవ్వనున్నారు. షోయ‌బ్ ఎంపిక ప‌ట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. జిల్లా వాసికి అరుదైన అవ‌కాశం రావడం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. ప‌లువ‌రు షోయ‌బ్ ను అభినందించారు.

About Author