NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శరన్నవరాత్రుల్లో భాగంగా జబర్దస్త్ ఈవెంట్లను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన నిర్వహించే జబర్దస్త్ ఈవెంట్లను విజయ్ డాక్టర్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఇందుకు  సంబంధించి మంగళవారం వారు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేసి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు, యువతను దృష్టిలో ఉంచుకొని వారిని ఉత్తేజ పరచి వినోదం అందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు, ఈనెల 21న శనివారం రాత్రి స్థానిక భారతీయ హై స్కూల్ సమీపంలో వీరలక్ష్మి గారి బృందం చే కూచిపూడి నాట్యం, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, నెల్లూరు కవిత టీములచే ఇండియన్ ఐడిల్ సింగర్చే ఈవెంట్లను జరుపుతున్నామన్నారు, కావున మండల ప్రజలు ఈ కార్యక్రమాలలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

About Author