NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊపందకున్న తెదేపాలోకి చేరికలు

1 min read

రాష్ట్రానికి చంద్రబాబు  నాయకత్వం అవసరమని తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నాం

వైసీపీని వీడి జమీల్ ,రసూల్  ఆధ్వర్యంలో  తెదేపాలోకి చేరిన కుటుంబాలు.

పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తాం..

నందికొట్కూరు తెదేపా జెండాను ఎగరేద్దాం..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నియోజకవర్గ తెదేపా నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి మాండ్ర శివానంద రెడ్డి  నాయకత్వంలో  నందికొట్కూరు పట్టణానికి చెందిన  వైసీపీ కార్యకర్తలు 30 కుటుంబాలు సోమవారం  జమీల్  ,రసూల్  ఆధ్వర్యంలో మాండ్ర శివానంద రెడ్డి  సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మాండ్ర పసుపు కండువా వేసి  పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాండ్ర మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరమని అన్నారు.అనంతరంఆరిఫ్,నేత్ర,ఆదిల్, సంతోష్ ,షాకీర్,ముఈస్,ఈశ్వర్, నవదీప్, కాజా, మహబూబ్, ఫయాజ్ ,నిఖిల్ ,సమీర్, అతిక్, కలాం, అవినాష్ తదితరులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య, మూర్తుజావలి, జాకీర్ హుస్సేన్, షాలు, నిసార్  తదితరులు పాల్గొన్నారు.

About Author