విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీసు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.అనుమానితులను విచారించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు .కార్ల డ్రైవర్లు సీటు బెల్టు వేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు.పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు.రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు చేపట్టారు.