PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎన్జీ సెగ్మెంటులోకి… టయోటా కిర్లోస్కర్ మోటార్

1 min read

పల్లెవెలుగు, వెబ్ అనంతపూర్​: తన కస్టమర్ – ఫస్ట్ ఫిలాసఫీకి అనుగుణంగా , టయోటా కిర్లోస్కర్ మోటార్ ( టీకేఎం ) సీఎన్జీ సెగ్మెంట్లోకి తన ప్రవేశాన్ని ప్రకటించింది . తద్వారా టయోటా గ్లాంజాస్ , అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ లైనప్ రెండింటిలోనూ వినియోగదారులు ఎంచుకోవడానికి మరిన్ని మోడళ్లను అందిస్తుంది . కస్టమర్లు ఎంచుకోవడానికి ఎకో ఫ్రెండ్లీ , చౌకైన ఆప్షన్లను అందిస్తుంది . తద్వారా , భారతీయ వినియోగదారులు వివిధ రకాల రవాణా అవసరాలను తీరుస్తుంది .ఈ సందర్భంగా టీకేఎం సేల్స్ , స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ , ” కస్టమర్ కేంద్రంగా ఉండే కంపెనీ కావడం వల్ల , కస్టమర్ల ఆసక్తికి పెద్దపీట వేయడాన్ని టీకేఎం విశ్వసిస్తుంది . టయోటా వద్ద మా లక్ష్యం ఎప్పుడూ కస్టమర్ల ఆకాంక్షలపై స్పష్టమైన దృష్టి సారించడం ద్వారా , మా కస్టమర్లకు అత్యంత ఆచరణీయమైన ఉత్పత్తులు , సేవలను అందించడం ద్వారా మార్కెట్ అవసరాలను తీర్చడమే . అదే దార్శనికతను దృష్టిలో ఉంచుకొని , సీఎన్జీ సెగ్మెంట్లో మా ప్రవేశాన్ని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము . మా అత్యంత డిమాండ్ ఉన్న రెండు మోడళ్లు టయోటా గ్లాంజా , అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కోసం సీఎన్జీ వేరియంట్లలో డ్రైవింగ్ అందిస్తున్నాము . ఈ కొత్త మోడళ్లతో మా కస్టమర్లు ఎంచుకోవడానికి మార్కెట్ లో మరిన్ని ఆప్షన్లను పొందుతారని మేం విశ్వసిస్తున్నాం . తద్వారా ‘ అందరికీ మొబిలిటీ ‘ అనే మా తత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాం . టయోటా వాహనాన్ని సొంతం చేసుకునే ఆనందంతో పాటు , మా వినియోగదారులు తక్కువ నిర్వహణ ఖర్చు , టయోటా వాహనాలు అందించే పూర్తి మానసిక ప్రశాంతతతో కూడా ప్రయోజనం పొందుతారు . తద్వారా ‘ అందరికీ సామూహిక ఆనందాన్ని అందిస్తారు ” అని ఆయన ముగించారు .

About Author