వినోదం..విజ్ఞానం
1 min readనేటి నుండి స్వరాజ్యమైదాన్ లో ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్గనైజర్ పి.కృష్ణ, పి.సుబ్బారావు
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: నగర ప్రజలకు వేసవి వినోదం, ఆహ్లాదం అందించేందుకుగాను స్వరాజ్యమైదాలో విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఈనెల 4 వ తేదీ నుండి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్గనైజర్ పి.కృష్ణ, పి.సుబ్బారావు తెలిపారు. స్వరాజ్యమైదాన్ లోని ఎగ్జిబిషన్ ప్రాంగణంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. వేసవి నేపథ్యంలో నగర వాసులు ఉల్లాసం, ఆనందం, ఆహ్లాదం కొరకు ఎంతగానో ఎదురుచూస్తుంటారన్నారు. ఈ ఏడాది కరోనా సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన మే 31 వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ఈ నెల 4, 5 తేదీలలో ఎటువంటి ప్రవేశరుసుము లేదని, ఆతరువాత నామమాత్ర ప్రవేశ రుసుము ఉంటుందని తెలిపారు.
ఎగ్జిబిషన్.. ప్రత్యేకత
ప్రదర్శనలో చేనేత, హస్త కళలు, జౌళి వస్తువులు, కళంకారి, బెంగాల్ కాటన్, కాశ్మీరీ వస్తువులకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని ఆర్గనైజర్ పి.కృష్ణ, పి.సుబ్బారావు తెలిపారు. నగర వాసులకు వినోదం, విజ్ఞానం అందించేందుకుకుగాను ఎమ్యూజ్ మెంట్స్ జైంట్ వీల్ ప్రత్యేక ఆకర్షణ అన్నారు. అలాగే కప్ సాసర్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ట్రైన్ వంటి వినోదానికి అవకాశం ఉందన్నారు. వీటితో పాటు అతి పెద్ద ఫుడ్ కోర్టు, 20 రకాల దోసెలు, అప్పడాలు, బజ్జీ స్టాల్, కూల్ డ్రింగ్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కోవిడ్ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రాంగణంలోకి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రావాలన్నారు. మాస్కు లేకపోతే అనుమతి లేదని తెలిపారు. వాహనదారులకు పూర్తిస్థాయిలో పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద, రైతు బజారు పార్కింగ్ స్టాండ్ వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో నిర్వహణా కమిటీ సభ్యులు ఆర్. నారాయణరావు, ఎస్.కె. మున్నాభాయ్ పాల్గొన్నారు.