ఉత్సాహంతో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో పట్ట బద్రుల ఓటరు నమోదు కార్యక్రమ ప్రచారంలో పాల్గొన్న కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఆకే పోగు ప్రభాకర్ గారు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు,కర్నూల్ మండల అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం సయ్యద్ గ్రామంలో ఉన్న పట్ట భద్రులను కలిసి వారికి ఫారం B 18 నీ ఇవ్వడం జరిగినది. గ్రామ నాయకుల సహకారంతో వారు ఫారం B 18నీ పూర్తి చేసి ఇంచార్జ్ ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఇన్చార్జి గారు మాట్లాడుతూ మీరందరూ గ్రామంలో ఎంతో ఉత్సాహంతో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చాలామందికి అవకాశం కల్పించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మన తెలుగుదేశం పార్టీ మన బంధువులు, స్నేహితులు ఇంకాఎవరైనా పట్ట బద్రులు ఉంటే ఓటరు నమోదు చేయించ వలయునని విజ్ఞప్తి చేయుచున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాజీ ఎంపీటీసీ ఎం. నాగరాజు, మాజీ సర్పంచ్ సోమన్న, గ్రామ ఉపసర్పంచ్ తిమ్మారెడ్డి గారు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు v. మునుస్వామి, మండల తెలుగు యువత అధ్యక్షులుG. నెహ్రూ కుమార్, బోయ మహేంద్ర నాయుడు, తెలుగు యువత నాయకులు వడ్డే బీమా, లక్ష్మీనారాయణ, లక్ష్మీ రెడ్డి, k. సూర్యచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.