పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి..
1 min read– మునిసిపల్ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఇండియన్ స్వచ్చత లీగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హే సేవ కార్యక్రమం పై నగరపాలక సిబ్బంది, విద్యార్థులతో నిర్వహించిన అవగాహనా ర్యాలీ ని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుండి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ అపరిశుభ్రత కారణంగా రోగాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతీ వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించినప్పుడే రోగాలు దరిచేరవన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిస్థితుల పై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్:ఎన్ రాధ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్:మాలతి , డిఇ పి. కొండలరావు, మేనేజర్, ఆర్వో కె శోభ, లింగేశ్వరి, షిరాజ్, ఏఇ లు, గాంధీ, సాయి, మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ పర్యావరణ కార్యదర్శులు, నగరపాలక సంస్థ సిబ్బంది, యువతీ, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.