NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణ మొక్కలతోనే సాధ్యం

1 min read

మట్లిసర్పంచ్ నాగార్జున ఆచారి

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి/వీరబల్లి: పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడంతోనే సాధ్యమని మట్లి సర్పంచ్ నాగార్జున ఆచారి పేర్కొన్నారు.ఆంద్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డ్ ఆదేశాల మేరకు స్థానిక విఆర్డీఎస్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మట్లి పంచాయతీ సచివాలయం వద్ద రైతులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక సంఖ్యలో మొక్కలు నాటి పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి మానవ మనుగడకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వద్దు మొక్కలు ముద్దు అనే నినాదంతో మట్లి గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయడానికి కృషి చేస్తామన్నారు.విఆర్డీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఔషధ గుణాలు గల ఉసిరి, జామ, కరివేపాకు, పనస,  ,సీతాఫలం,  రామతులసి, రామపళం, దానిమ్మ మొక్కలు లాంటివి పెంచుకుంటే కుటుంభం అంతా ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. గత పదహారు సంవత్సరాలుగా  జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఇంటిలో కనీసం పది మొక్కలు నాటి పచ్చధనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు,గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బందితదితరులు  పాల్గొన్నారు.

About Author