మహా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయబడిన ఆయా ఏర్పాట్లను ఈ రోజు ఈఓ లవన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 30 పడకల తాత్కాలిక ఆసుపత్రి, నంది గుడి కూడలి వద్ద ఏర్పాటు చేయబడిన దేవస్థానం సమాచార కేంద్రం, లడ్డు విక్రయకేంద్రాలు, అన్నప్రసాదం వితరణ కేంద్రం క్యూలైన్లు మొదలైనవాటిని ఈఓ లవన్న పరిసిలించాడు30 పడకల ఆసుపత్రిలో అందించబడుతున్న వైద్యసేవల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి . సోమశేఖరయ్య ఈఓ వివరించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలు అందిస్తుండాలని సూచించారు.ప్రథమచికిత్స కేంద్రాలలో అవసరమైన మందులన్నింటిని అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా భక్తులు అధికసంఖ్యలో పాదయాత్రతో రావడం జరుగుతుందని వారికోసం ప్రథమ చికిత్స కేంద్రాలలో పూతమందులు (అయింట్మెంట్స్ ) ఒళ్ళు నొప్పులకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.అనంతరం కార్యనిర్వహణాధికారి నందికూడలి వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. భక్తులు అడిగిన సమాచారాన్ని ఓపికగా తెలియ చెబుతుండాలని సమాచార కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న శివసేవకులను సూచించారు. సమాచార కేంద్రాలలో సమాచార కరపత్రాలు మొదలైనవాటిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని శ్రీశైలప్రభ విభాగాన్నిఅనంతరం లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాన్ని పరిశీలించారు. భక్తులు అధికసమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని విక్రయకేంద్ర పర్యవేక్షకులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు . అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.