శ్రీశైల మల్లన్నకు పట్టువస్ర్తాలు సమర్పించిన ఈఓ
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ఈఓ లవన్న దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలను, ఫలపుష్పాదులను ఈఓ సమర్పించారు. కార్యక్రమములో స్వామివారి ప్రధానార్చకులు జె.భద్రయ్యస్వామి, వేదపండితులు గంటిరాధకృష్ణశర్మ, అవధాని, ఆలయసహాయ కార్యనిర్వహణాధికారి ఎ.హరిదాసు తదితరులు పాల్గొన్నారు.