సీబీఐ చేతికి ఈపీఎఫ్ కేసు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కడపలో 2016లో జరిగిన ఈపీఎఫ్ నిధుల స్కామ్ కేసు సీబీఐకి చేరింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కడప ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో 1.64 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో 2016లో కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే విషయంలో సీబీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం 2017లో కేసు నమోదు చేసింది. ఒకే నేరం మీద రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేయకూడదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈకేసును సీబీఐకి అప్పగించింది. డిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-1946 సెక్షన్ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తు సీబీఐకే అప్పగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.