సమనత్వమే ఇస్లాం సందేశం : మౌలానా అహ్మద్ నక్షాబంది
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ప్రపంచంలో ప్రతిఒక్కరు అన్నదమ్ముల కలిసి ఉండాలని ఇస్లాం బోధిస్తుంది అని ఖతీబ్ – హిందూస్తాన్ మౌలానా అహ్మద్ నక్షాబంది తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలో ఎండబ్ల్యూ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ ఆద్వరంలో అహ్హ్లే – సున్ని జమాత్ ఇస్తేమా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు, మౌలానా మాట్లాడుతూ ఇస్లాం అంటేనే శాంతిని బోధిస్తుంది అని సమాజంలో అందరూ ప్రశాంత జీవనం కొనసాగించాలన్నారు, హిందు,ముస్లిం,సిక్కు,ఈసాయి భాయ్ భాయ్ అని, మతాలు వేరైనా గ్రంధాలు బోధించే సారాంశం ఒకటేనని హితువు పలికారు, ముస్లింలు ప్రతిరోజు నమాజ్ చేసి సన్మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమానికి సహకరించిన ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా మరియు వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సుల్తాన్,సొసైటీ ఖాదర్, షరీఫ్,అనవర్ హుస్సేన్,గౌస్ పీర్, ఖాజామోద్దీన్,హాబీబ్,ఆసీఫ్ బేగ్, ఫారూఖ్, మునీర్,జబిల్లా,మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ అహ్మద్, మరియు మత పెద్దలు పాల్గొన్నారు.