PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఛాయ్ వి గార్డ్ సహకారంతో దివ్యాంగులకు పరికరాలు

1 min read

– మరియా నిలయం ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్లు,కృత్రిమ పరికరాలు
– మేనరికపు వివాహాలు అరికట్టాలి -దివ్యాంగులకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం: సుపీరియర్ సిస్టర్ శిల్పా
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మరియా నిలయం సాంఘిక సేవా సంస్థ గార్గేయపురం వారి ఆధ్వర్యంలో దివ్యాంగ చిన్నారులకు సికింద్రాబాద్ ఛాయ్ వి గార్డ్ సహకారంతో కృత్రిమ పరికరాలు మరియు వీల్ చైర్లను విమల ప్రొవి న్షియల్ హౌస్ సుపీరియర్ సిస్టర్ శిల్పా పంపిణీ చేశారు.మంగళవారం మరియా నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిస్టర్ శిల్పా ఈసందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల పేద దివ్యాంగ చిన్నారులకు కృత్రిమ పరికరాలు మరియు వీల్ చైర్లను చాయ్ వి గార్డ్ సహకారంతో వీటిని అందజేయడం మీ అదృష్టమని వీటిని ప్రతి ఒక్కరూ చక్కగా సద్వినియోగం చేసుకుంటూ వారి జీవిత అభివృద్ధికి ఇవి తోడ్పాటు అందించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి చిన్నారులకు ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయత ఆదరణ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఫిజియోథెరపీ,మాటలు నేర్పించడం వంటివి తల్లిదండ్రులు ఇంటిదగ్గర ప్రతిరోజు చేస్తూ ఉంటే అదేవిధంగా చిన్నారులకు మంచి ఆహారం మంచిగా వారిని చూసినట్లయితే వారిలో తప్పకుండా మార్పు అనేది వస్తుందని అన్నారు.వికలత్వాన్ని నిర్మూలించాలంటే మేనరికపు వివాహాలు,బాల్య వివాహాలు,ఇండ్ల దగ్గర మంత్రసానులతో డెలివరీలు చేయించడం తదితర విషయాల వల్ల వికలాంగత్వం పిల్లలు వచ్చే ప్రమాదం ఉందని వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలలకు పంపుతూ వారిని చక్కగా చదివించే బాధ్యత మీపై ఉందని అన్నారు.తర్వాత 20 మంది చిన్నారులకు వీల్ చైర్లు,20 మందికి కృత్రిమ పరికరాలు సిస్టర్ శిల్పా మరియు దీన సేవన సభ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సిస్టర్ సారంగా వాటిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మరియా నిలయం సుపీరియర్ సిస్టర్ స్వాతి,ఫిజియోథెరపిస్ట్ సిస్టర్ క్లేరీన,సిస్టర్ విజయ మరియు చాయ్ వి గార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author