NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్​కు మూడు అనస్తీసియా వర్క్ స్టేషన్ పరికరాలు అందజేత

1 min read

అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మూడు అనస్తీసియా వర్క్ స్టేషన్ పరికరాలను  డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు అందులో భాగంగా ఈరోజు 18 లక్షల 75 వేల విలువగల మూడు అనస్తీసియా వర్క్ స్టేషన్ పరికరాల  డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యo అందించడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారితో మాట్లాడిన అనంతరం వారు ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆస్పత్రిలో పవర్ గ్రేడ్ నామ్స్ ప్రకారం టెండర్స్ వెళ్లినట్లు తెలియజేశారు అనంతరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆసుపత్రి నుండి ఎం ఓ యు  పరికరాలను అవగాహన ఒప్పందల సంతకాలు జరిగాయి అనంతరం పవర్ గ్రిడ్ సౌజన్యంతో మూడు వర్క్ స్టేషన్లు డొనేట్ చేసే అవకాశం ఉంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, అనస్తిసియా హెచ్ఓడి, డా.కొండారెడ్డి, పవర్ గ్రిడ్  కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్  శ్రీ. స్ క్. ఎస్.చౌవన్, శ్రీ.విక్రమ్ తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author