NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎర్రచందనం బడా స్మగ్లర్ల ముఠా అరెస్ట్​

1 min read

– రెండు ప్రాంతాల్లో ఆకస్మిక దాడి
–55 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు 5 సెల్​ఫోన్లు స్వాధీనం
– వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్​
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : జిల్లాలో ఎర్రచందనం బడా స్మగ్లర్ల ముఠా అరెస్టు అయింది. టి. సుండుపల్లిలోని రెండు ప్రాంతాల్లో ఎస్​ఐ భక్త వత్సలం, రాయచోటి సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి దాడి చేసి స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అన్బరాజన్​ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. టి. సుండుపల్లిలోని సుండుపల్లి- సానిపాయి మెయిన్ రోడ్డులో అక్రమ రవాణా కు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలతో పాటు ముద్దాయిలను అదువులోకి తీసుకున్నారు. ఇందులో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లతోపాటు ఏడుగురిని అరెస్టు చేశారు.

రెండు కేసుల్లో కలిపి మొత్తం 55 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్​ గజ్జల శ్రీనివాసులు రెడ్డి అలియాస్​ శీన్​ రెడ్డి పై గతంలో 15 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, పీడీ యాక్ట్​ కేసులో అరెస్టయ్యాడు. ఇతనిపై చిత్తూరు జిల్లాలో 8, కడపలో 9 కేసులు ఉన్నాయి. అదేవిధంగాఆ మరో బడా స్మగ్లర్​ రామాపురం మండలం పొత్తుకూరు పల్లెకు చెందిన రెడ్ప్ప రెడ్డిపై కడప జిల్లాలో 10 కేసులు ఉన్నాయి. వీరితోపాటు మరికొంత మంది స్మగ్లర్లు అరెస్టు చేశారు.

About Author