పెదవేగి మండలంలో ఏరువాక కార్యక్రమం
1 min read
ఉలవలు,మినువులు జల్లు పంటల సాగు పై ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధనలు,పరీక్షలు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదవేగి రానున్న రోజుల్లో ఉలవలు,పెసలు,మినుములు,మాదిరిగానే వరి విత్తనాలు కూడా భూమి పై జల్లి పంటలు పండించే నూతన వరి సాగు విధానాన్ని ఏలూరు వ్యవసాయ ఏరువాక సమన్వయ కర్త ఫణి కుమార్, శాస్త్రవేత్త ఎన్ నాగేంద్ర బాబు రైతులకు వివరించారు,పెదవేగి మండలం అంకన్న గూడెం లో మంగళవారం పెదవేగి మండల వ్యవసాయాధి కారి ఎమ్ ప్రియాంక ఆద్వర్యం లోఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏరువాక కేంద్ర ఏలూరు సమన్వయ కర్త డాక్టర్ కె ఫణి కుమార్, శాస్త్ర వేత్త నాగేంద్రబాబు నేతృత్వం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్య క్రమం లో డాక్టర్ ఫణి కుమార్ మాట్లాడుతూ మారుతున్న వ్యవసాయ శాస్త్ర సాంకేతికతను అంది పుచ్చు కుంటూ నేల స్వభాభవాల పై పరిశోధనలు( పరీక్షలు) నిర్వహించి ఆయా నే ల లకుఅనుగుణమైన పంటల విత్తనాలను ఎంపిక చేసుకోవడం మంచిదన్నారు,ఖరీఫ్,రబీ సీజన్ లలో వాటా వరణాలను తట్టుకునే వరి విత్తనాల రకాలను గురించి డాక్టర్ ఫణి కుమార్ రైతులకు వివరించారు,సహజం గా మెట్ట ప్రాంత భూములు వరి మొక్క జొన్న ,కొబ్బరి,పంటల సాగుకుఅనువుగా ఉంటాయని చెప్పారు,మారుతున్న కాలానికి అనుగుణంగా పండించే వరి పంట పై ఆశించే పురుగులు,దోమలు,తెగుళ్ళు గురించి రైతుల డిగిన ప్రశ్నలకుడాక్టర్ ఫానికుమార్ సమాదానాలు ఇచ్చారు, వరి పైరు చిరు పొట్ట దశనుంచి పంట చేతికొచ్చే దశ వరకు పంటను ఆశించే తెగుళ్ల నివారణకు చేపట్ట వలసిన సస్య రక్షణ చర్యలు రైతులకు అర్థమయ్యేలా వివరించారు,ఏలూరు జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రసహాయ సంచాలకులు పీ లలిత సుధ మాట్లాడుతూ రైతులందరూ వేసవిలో చిరు ధాన్యాలు పండించి అదనపు ఆదాయం తో బాటు ఖరీఫ్ పంటలు అవసరమయ్యే భూ సారాన్ని కూడా పెంచడం లో భాగ స్వాములు కావాలని రైతులకు పిలుపు నిచ్చారు,పెదవేగి మండల వ్యేవసాయాధి కారి ప్రియాంకమాట్లాడుతూ రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడి భూసారాన్ని పెంచుకోవాలన్నారు,తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించాలని అన్నారు,పంటల సాగులో రైతులు దుబారాను తగ్గించుకు నే విధం గా వ్యవసాయం చేసి ఆర్థికాభివృద్ధి పొందాలని చెప్పారు,ప్రతి రైతు తమ పంటలను తప్పని సరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు,ప్రభుత్వం రైతులకు అందించే పథకాలను సద్వినియోగం చేసు కుని మెరుగైన ఆర్థిక ఫలాలు అందుకోవాలని వ్యవసాయాధికారి ప్రియాంక రైతులకు సూచించారు,అనంతరం పినకడిమి గ్రామం లో ఏరువాక కేంద్ర ప్రతినిధులు వరి చిరు సంచులు ఎమ్ టీ యు,1426, బి పీ టీ 3082, పై నిర్వహిస్తున్న చిరు సంచుల ప్రదాసనా క్షేత్రాన్ని సందర్శించి వరి రకాల గుణగణాలను శాస్త్ర వేత్తలు క్షున్నం గా పరిశీలించారు,ఈ కార్యక్రమం లో అంకన్నగూడెం రైతు సేవా కేంద్రం సిబ్బంది శ్రీసుందర్ పినకదిమి రైతు సేవాకేంద్రం వీ ఎ ఎ శ్రీ సురేందర్ ,పట్టుపరిశ్రమ సిబ్బంది కుమారి,ఆర్ ఎ డ బ్ల్యూ ఈ పీ విద్యార్దులు ,ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.