పత్తికొండలో ఐటిఐ.. పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండలో ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి పత్తికొండలో పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల వసతి గృహము పాలిటెక్నిక్ కాలేజ్ ని మంజూరు చేస్తానని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికైనా పత్తికొండ ప్రాంతంలో ఐటిఐ, పాలిటెక్నిక్, ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని పత్తికొండ నియోజవర్గ శాసనసభ్యులు శ్రీదేవికి విన్నవించారు. ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే శ్రీదేవికి వినతి పత్రం సమర్పించారు. ఎందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే పనులు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని వారితో చెప్పారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ మాజీ కార్యదర్శి మోహన్,మండల సహాయ కార్యదర్శి పవన్ షాకీర్, షాషావలి, పట్టణ అధ్యక్షులు వినోద్, హేమంత్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.