కర్నూలు జిల్లాలో… 2 పోలీసు ఔట్ పోస్టు ల ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద పోలీసు ఔట్ పోస్టు మరియు మంత్రాలయం దేవస్ధానం దగ్గర ఒక టూరిస్టు పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఏయిర్ పోర్టు వద్ద ప్రముఖుల భధ్రత మరియు ప్రయాణికుల రధ్దీని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు కు అనుమతి ఇచ్చిందని సమాచారం. అదే విధంగా కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కు వచ్చే భక్తులు, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఏపి ప్రభుత్వం టూరిస్టు పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు కు అనుమతి ఇచ్చింది. ఓర్వకల్లు పోలీసు ఔట్ పోస్టు మరియు మంత్రాలయం దేవస్ధానం దగ్గర టూరిస్టు పోలీసు ఔట్ పోస్టులలో భద్రత, రక్షణ పరంగా ఇన్ స్పెక్టర్ స్ధాయి అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా తగినంత పోలీసు సిబ్బందితో 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్. విజయరావు ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.