బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు.. భారీ లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా మొదలవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్, నిప్టీలు 0.41 శాతం, 0.33 శాతం లాభంతో కొనసాగుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 1.40 శాతం లాభంతో కదులుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. బ్యాడ్ బ్యాంక్ గురించి ఆమె వివరించే అవకాశం ఉంది. వివిధ బ్యాంకుల్లోని నిరర్థక ఆస్తులు, బ్యాడ్ లోన్స్ ను ఈ బ్యాడ్ బ్యాంక్ తీసుకుటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ లో జోష్ నెలకొంది. మధ్యాహ్నం 12:40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 59003 స్థాయి వద్ద ఉండగా.. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 17,586 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 538 పాయింట్ల లాభంతో 37,394 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. 37,500 స్థాయి బ్యాంక్ నిఫ్టీకి ప్రధాన అవరోధంగా ఉంది. ఈ స్థాయి వద్ద సపోర్ట్ తీసుకోగలిగితే బ్యాంక్ నిఫ్టీలో మరింత అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.