వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో. వాసవి క్లబ్,వాసవి వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని బనగానపల్లె ఆర్టిసి బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీసీ డిఎం రవి కిషోర్ అన్నారు. వేసవికాలంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దాహార్తి తీర్చేందుకు తాము కోరిన వెంటనే వాసవి క్లబ్,వనితా క్లబ్ వారు ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. వాసవి క్లబ్, వనితా క్లబ్ లు సామాజికపరమైన ,ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంతో నడుస్తున్నాయని ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిఎం కోర్కెమేరకు చలివేంద్రాన్ని ఏర్పాటుచేసామని క్లబ్ కార్యనిర్వహకులు శ్రీరామ సుబ్రమణ్యం, శ్రీమతి గుండా సుప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ,ఆర్యవైశ్య ప్రముఖులు దమ్మాల వెంకటసుబ్బయ్య, టంగుటూరు శ్రీనివాసులు, గుండా శ్రీనివాసులు,గుండా రవికుమార్, బచ్చు రమేష్ , చక్రపాణి, సత్యం, పశువుల విద్యాసాగర్ తాల్లాంకి సుబ్రమణ్యం మహిళా సభ్యులు గుండా వసంత,వంకదారి స్వర్ణలత,ఆపర్ణ,శివజ్యోతి లుతదితరులు పాల్గొన్నారు.