PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు నందు వేసవికాలం దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రాన్ని హోళగుంద ఎస్సై జి.పెద్దయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వేసవికాలంలో ఎండలు మండుతున్న వేళ  స్థానిక బస్టాండ్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీని అభినందించారు. భవిష్యత్తులో మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ కి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సై పెద్దయ్య నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాశా అల్లా  సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author