PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. త్వరలో నోటిఫికేషన్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీకి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ అవుతోంది. రేపు లేదా ఎల్లుండి.. రెండురోజుల్లో నోటీఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాలుంటే.. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశ‌గా ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళిక రిత్యా చాలా విస్తార‌మైనది కావ‌డంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

     

About Author