ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
1 min read
జొన్నలు – హైబ్రిడ్ రకము (C 43/మహేంద్ర రకము)ప్రభుత్వ కనీస మద్దత్తు ధరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తెలిపారు.
నంద్యాల, న్యూస్ నేడు : ప్రస్తుతము జొన్నలు కనీస మద్దత్తు ధర క్వింటాలుకి రూ.3,371/- రైతులందరు జొన్నలను పౌర సరఫరాల సంస్థ ద్వార ప్రభుత్వ కనీస మద్దత్తు ధరకు విక్రయించాలన్నారు. 01.04.2025 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఇచ్చిన సర్క్యులర్ ఆదేశాల ప్రకారం నంద్యాల జిల్లాలో పండిoచిన జొన్నలు అయిన హైబ్రిడ్ రకము అయిన (C 43/మహేంద్ర రకము), జొన్నలను ప్రభుత్వ కనీస మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగినదన్నారు. రైతులందరు తమ సమీప రైతు సేవా కేంద్రాల నందు e-crop మరియు e-kyc తో పాటు తమ పేర్లను నమోదు చేయించుకావాలన్నారు.. e-crop మరియు e-kyc తో పాటు తమ పేర్లను నమోదు చేయించుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులనీ తెలిపారు. జిల్లాలోని రైతు లందరికీ తెలియచేయడం ఏమనగా, రైతులు తాము పండించిన జొన్నలను ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్ధతు ధర క్వింటా కు రూ.3,371/- చొప్పున ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి కొనుగోలు జరపాలన్నారు. హమాలీలను రైతులే ఏర్పాటు చేసుకుంటే హమాలీ ఖర్చులను ప్రభుత్వమే అదనoగా ఇస్తుందన్నారు. గోనే సంచులను మరియు జొన్నలను రవాణా చేయుటకు గల రవాణా ఖర్చులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ భరిస్తుందన్నారు. కొనుగోలు చేసిన వెంటేనే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమచేయడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సి.విష్ణు చరణ్ తెలిపారు.