అటవీ శాఖ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎస్టిమేషన్ వెయ్యండి
1 min read– రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ ఎరసాని మధుసూదన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని కొండపేట గ్రామంలో ఉన్న అటవీ శాఖ స్థలం రెండు ఎకరాలకు పైగా ఉంటే ప్రస్తుతం ఎకరా 30 సెంట్లు మాత్రమే ఉందని, మిగతా స్థలం లో సమాధులు తోపాటు కొంతమేర ఆక్రమణలకు గురవుతున్నాయని, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ ఎర్రసాని మధుసూదన్ రెడ్డి అన్నారు, శనివారం అయన కొండపేటలోని అటవీ శాఖ కు సంబంధించిన స్థలాన్ని పాడుబడ్డ అక్కడి రూములను స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ ఎంపీటీసీ, అలాగే ఎంపీపీ లు ఈ అటవీశాఖ స్థలం విషయమై నా దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. అక్కడే ఉన్న పాతబడ్డ రూములలో ఆకతాయిల అల్లరి ఎక్కువ గా ఉండడం ఉన్న స్థలం ఆక్రమణలకు గురవుతుండడంతో, అక్కడ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు ఇక్కడ చిన్న పిల్లల పార్కు, అదేవిధంగా పెద్దలు వాకింగ్ ట్రాక్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వేసి తమకు ఇవ్వాలని ఇవ్వవలసిందిగా డీఎఫ్ఓ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు, అదేవిధంగా అక్కడ లైటింగ్ ఏర్పాటు కూడా చేస్తామని కొండపేట ప్రజలకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది, అక్కడ ఉన్న పాత పడ్డ రూములను పూర్తిస్థాయిలో తొలగించి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు, ఊరి నడిబొడ్డిలో ఉన్నటువంటి ఈ స్థలంలో చిన్నపిల్లల పార్కు, ప్రజలకు వాకింగ్ ట్రాక్ కుఏర్పాటు అటు చెన్నూరు వారికి కూడా ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు, వీలైనంత త్వరగా ఎస్టిమేషన్ పూర్తి చేసి తమకు పంపిస్తే పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వై ఎస్ ఆర్ సి పి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్ అల్లి శ్రీరామమూర్తి, మోహన్ రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.