మొదలైన మూల పెద్దమ్మ జాతర
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రమైన గడివేములలో వెలసిన మూల పెద్దమ్మ దేవాలయం జాతర ఉత్సవాలు గురువారం నుంచి మొదలయ్యాయి. జాతర సందర్భంగా ఇతర గ్రామాల నుండి మరియు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పదో తరగతి పరీక్ష రాస్తున్నా విద్యార్థులు తమని కనికరించాలని గురువారం నాడు అమ్మవారికి ఆకు పూజ. కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటానికి పోయే కార్యక్రమం మరియు బోనాల కుండ లతో అమ్మవారి దర్శనం ఏర్పాటుచేశారు జాతర సందర్భంగా వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ప్రధమ చికిత్స కేంద్రాలను జెఎస్డబ్ల్యూ యాజమాన్యం ఏర్పాటు చేసింది వాల్మీకి సేవా కమిటీ ఆధ్వర్యంలో జూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని త్వరగా జరిగేలా ఏర్పాటు చేసినట్లు . ఆలయ ఈవో మోహన్ ఆలయ చైర్మన్ చిన్నన్న తెలిపారు జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య గట్టి బందోబస్తుఏర్పాటు చేశారు. పరిశ్రమ నుండి వచ్చే వాహనాలను రెండు రోజులు నంద్యాల మీదుగా మళ్లించినట్టు ఎస్సై తెలిపారు.