మొదలైన పది పరీక్షలు.. ప్రశ్న పత్రాలపై బార్ కోడింగ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: సోమవారం నాడు మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి ఈ నెల 18వ తేదివరకు జరగనున్నాయి. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఆదర్శ పాఠశాల నందు 197మంది గాను ఇద్దరు గైర్హాజరయ్యారు 195 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 176 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో వద్ద 144సెక్షన్ ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రశ్న పత్రాలపై నెంబరింగ్ జవాబు పత్రానికి బార్ కోడ్ ఏర్పాటు చేశారు. పరీక్ష తొలి రోజున ఫ్లైయింగ్ స్క్వాడ్ సభ్యులు రఘు రామిరెడ్డి మండలంలోని రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో వద్ద ఎవరైనా అవకతవకలకు, మాస్ కాఫీయింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర గ్రామాల నుండి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసి ఆధ్వర్యంలో ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు.