ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మీద చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడ చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం నా వివరణ కూడ తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు. నా అనుచరులను వేధింపులకు గురిచేసినా తట్టుకున్నారు. నా మీద జరుగుతున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారు. నాకు హుజురాబాద్ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తున్న‘ అని ఈటెల రాజేందర్ ప్రకటించారు.