ఇంట్లోనూ.. మాస్క్ పెట్టుకోవాల్సిందే..
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంట్లో కూడ మాస్క్ లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరింది. మాస్క్ పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తే కరోన వ్యాపించే అవకాశం తక్కువ ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ… ఇతరులను ఇంటికి ఆహ్వానించకుండా.. భౌతిక దూరం పాటించాలని నీతి ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు. ఇంట్లో ఒకరికి కరోన వస్తే అతడు మాస్క్ ధరించి ఇంట్లోనే ఉండాలని అన్నారు. కరోన లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే.. టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడకుండా.. ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉండాలని వీకే పాల్ సూచించారు.