సీఎం జగన్ ను బ్రహ్మదేవుడు కూడ జైలుకు పంపలేడు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ సింహమని, ఆయన ఎవరికీ భయపడరని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. బ్రహ్మదేవుడు కూడ జగన్ ను జైలుకు పంపలేడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎక్కడా కూడ చిన్న తప్పు చేయలేదని, అనవసరంగా ఆయన పై బురదజల్లుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఎవరైనా చీప్ లిక్కర్ ఇస్తామని ఓట్లు అడుగుతారా ? అని ప్రశ్నించారు. సోమువీర్రాజు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాలేదన్నారు.