ప్రభుత్వ స్థలాల్లో సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలివ్వాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్న పేదలకు అలాగే భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు కార్మిక కర్షక భవన్ నందు సిపిఎం సీనియర్ నాయకులు ఆంజనేయులు అధ్యక్షతన సిపిఎం కర్నూల్ మండల కమిటీ సమావేశం జరిగింది.సమావేశానికి హాజరైన కె.వి.నారాయణ మాట్లాడుతూ అనేక సంవత్సరాలు నుండి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఇంటి కోసం ఎదురుచూస్తూ సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుని అన్నారు.కర్నూలు మండలంలోని పసుపుల గ్రామంలో 200 మంది ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని గొందిపర్ల గ్రామంలో 100 మంది ఎదురుచూస్తున్నారని అంబేద్కర్ నగర్లో వంద మంది ఎదురుచూస్తున్నారని అలాగే సాగు చేసుకుంటున్నా అనేక కుటుంబాలు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని వారికి వెంటనే పట్టాలు మంజూరు చేసి ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని పేదల కోసం జగనన్న కాలనీల రూపంలో ఇల్లు కడుతున్నారని ఆ ఇళ్ల నిర్మాణం పునాదుల దగ్గరే ఆగిపోయిందని వెంటనే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అన్నారు.లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలని ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పి.బి హుస్సేన్ అయ్య మండల నాయకులు మృత్యుంజయుడు వెంకటేశ్వర్లు బిసన్న రాఘవేంద్ర నర్సింలు పాల్గొన్నారు.