హాకీ టీం సెమీస్ లో ఓడినా.. భారీ ఆఫర్లు !
1 min readపల్లె వెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళా హాకీ టీం ఓటమి చవిచూసింది. అర్జెంటీనాతో సాగిన సెమీస్ పోరులో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఆట ఓడిపోయానా సరే మహిళా హాకీ టీం అద్భుత ప్రదర్శనను చూపింది. రాంపాల్ సేన్ పోరాడిన తీరుకు దేశం మొత్తం అండగా నిలిచింది. గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త మహిళా హాకీ టీం సభ్యులకు ఇల్లు, కారు ఇస్తామని ప్రకటించారు. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ దొలాకియా భారత హాకీ జట్టులోని అమ్మాయిలకు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికీ 11 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఇల్లు ఉన్నవారికి 5లక్షల కారు ఇస్తానన్నారు. అమెరికాకు చెందిన మరొక వ్యక్తి హాకీ టీంలో సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటన చేశారు. తొలిసారి మహిళల హాకీ టీం ఒలంపిక్స్ లో సెమీస్ కు వెళ్లింది. ప్రపంచ ఛాంపియన్ అర్జంటీనాతో పోరాడి ఓడింది.