PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత ఎమ్మెల్యేలు ఉన్నా రెడ్లదే పెత్తనం:బిఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: బహుజనులు చైతన్యమై బహుజన రాజ్యం తేవాలని బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్చార్జి గద్దల లాజర్ బహుజన్ సమాజ్ పార్టీ  అసెంబ్లీ ఇన్చార్జి యల్  స్వాములు పిలుపునిచ్చారు. ఇంటింటికి బిఎస్పి పార్టీ కార్యక్రమంలో భాగంగా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో కరపత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1955 దాదాపు 47 సంవత్సరాలు రెడ్లు ఎమ్మెల్యేలుగా పరిపాలించారని అయితే కేవలం పట్టుమని 2వేల ఓట్లు లేని రెడ్లు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలైనా మనం ఎంతో సిగ్గుపడాలని 2009 నుండి ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఏర్పాటయింది.ఇప్పుడు కూడా వారి ఆధిపత్యమే ఉంది అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎమ్మెల్యేలకు సమాంతరంగా వారి ఆధిక్యత కొనసాగుతుంది.ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా గాని టిడిపి ద్వారా గాని గెలిచింది రెడ్లే.ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడినా ఆ పార్టీల ద్వారా ఎన్నికైన ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారా ఎందుకంటే వైఎస్ జగన్ కు మన ప్రయోజనాల కన్నా తన రెడ్డి సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యమని టిడిపి చంద్రబాబుకు ప్రజలు ఎటు పోయినా తన ప్రభుత్వం ఏర్పాటు కమ్మల ప్రయోజనాలే ముఖ్యం.కావునా బహుజనులారా చివరగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకున్న సమస్యలు పరిష్కారం కావాలన్నా మనం రాబోయే తరాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్న మనలను ఈ దేశ పాలకులు చేయడానికి ఏర్పాటు చేయబడిన బిఎస్పీ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు స్వీకరించాల్సిందే ఏనుగు గుర్తుపైనే ఓటు వేయాల్సిందేనని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ నాయకులు వినయ్,మనోజ్, ఆది,శ్రీను,నాగేంద్ర,చరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author